- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ క్షీణిస్తున్న నేపథ్యంలో, కాలుష్య కణాలను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. వాతావరణం అనుకూలిస్తే నేడు వాయువ్య ఢిల్లీలో ఐదు చోట్ల క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించనున్నారు. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇటీవల బురాయ్‌లో జరిగిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. ఈ చర్యతో గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
- Advertisement -



