Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టిజన్‌ కార్మికులను కన్వర్షన్‌ చేయాలి

ఆర్టిజన్‌ కార్మికులను కన్వర్షన్‌ చేయాలి

- Advertisement -

– టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ ఈశ్వర్‌రావు
– సంగారెడ్డి ఎస్‌ఈ సర్కిల్‌ ఆఫీసు ఎదుట ధర్నా
నవతెలంగాణ-సంగారెడ్డి

విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులను కన్వర్షన్‌ చేయాలని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ ఈశ్వర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ కన్వర్షన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా.. సంగారెడ్డి జిల్లా చైర్మెన్‌ రాములు అధ్యక్షతన ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎస్‌ఈ సంగారెడ్డి సర్కిల్‌ ఆఫీసు వద్ద మంగళవారం వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న 19600 మంది ఆర్టిజన్‌ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్‌ చేయాలన్నారు. కన్వర్షన్‌ చేయడం వల్ల ప్రభుత్వానికిగానీ, మేనేజ్మెంట్‌కుగానీ ఎలాంటి ఆర్థిక భారమూ పడదని తెలిపారు. త్వరలో జరగబోయే చర్చల్లో జాయింట్‌ కమిషనర్‌, మేనేజ్మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకుని స్టాండింగ్‌ ఆర్డర్‌ రద్దు చేయాలని కోరారు. సంస్థలో ఉన్న ఎగ్జిటింగ్‌ రూల్స్‌ ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. ఆర్టిజన్‌ కార్మికుల కన్వర్షన్‌ సాధన కోసం జరిగే పోరాటానికి సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. భవిష్యత్‌లో సమ్మెకి వెళ్తే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెన్నంటి ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర వైస్‌ చైర్మెన్‌ నరేందర్‌, సిద్దిపేట జిల్లా చైర్మెన్‌ సాధాకర్‌, మెదక్‌ జిల్లా చైర్మెన్‌ స్వామి, నాయకులు ప్రశాంత్‌, కనకరాజు, దుర్గశం, మల్లేశం, జైపాల్‌, మహిపాల్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్‌ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -