Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళాకారులు ఆట పాటలతో ప్రజలని చైతన్య చేయాలి

కళాకారులు ఆట పాటలతో ప్రజలని చైతన్య చేయాలి

- Advertisement -

ఉదయగిరి, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుల
నవతెలంగాణ – ఆలేరు టౌను  

దేశంలోని ప్రజల్ని విడదీస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టే పాలన చేస్తూ అభివృద్ధిని గాలికొదిలిన మోడీ పాలనకు వ్యతిరేకంగా అరుణోదయ కళాకారులు తమ ఆట పాటలు,వివిధ కళా రూపాల ద్వారా ప్రజలని చైతన్యపరచాల్సిన అవసరం ఉందని అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయగిరి అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా 7వ మహాసభ ఆలేరు పట్టణంలో ఆదివారం  ఫ్రెండ్స్ క్లబ్ లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఉదయగిరి మాట్లాడుతూ అరుణోదయ సంస్థ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ప్రజల కోసం తన ఆట పాటలతో, కళా రూపాల తో ముందుకు సాగుతుందని,సుబ్బారావు, పాణిగ్రాహి,కానూరి వెంకటేశ్వరరావు(తాత), అరుణోదయ రామారావు, వై. వెంకన్న, పల్సా భిక్షం లాంటి అనేక మంది కళాకారులు విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణం కోసం కళకే అంకితమై పోరాడి అమరులయ్యారని  పేర్కొన్నారు.

 ప్రలోభాలకు గురి చేసినా, వేటికీ లొంగకుండా ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు, సమాజంలో ఉన్న దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పాటలు రాసి, ఒగ్గు కథలు, బుర్ర కథలు రాస్తూ, వీధి నాటకాలు వేస్తూ ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు. సారాయి ఉద్యమాలు, మహిళా పోరాటాలు, విద్యార్థి ఉద్యమాలు,ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిందని ఇలా ప్రతి పోరాటంలో అప్పటికప్పుడు పాటలు,కళారూపాలతో ప్రజలను చైతన్యం చేశారని అన్నారు.

 ఇవాళ కళాకారులు, గాయకులు అంటే ఎవరు డబ్బులిస్తే వాళ్ల కోసం పాడేవారు,ఆడేవారుగా మారిపోయారని ఆరోపించారు. కళ కాసుల కోసం కాదని ప్రజల కోసమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రజలకు విడమరిచి చెప్పిందని అన్నారు. ఈ దేశంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం తమ అబద్ధపు, విద్వేష పూరిత ప్రసంగాలను రాజకీయ సభల నుండి, సోషల్ మీడియా నుండి ఇవాళ సినిమా రంగానికి పాకిందని, ఇవాళ విడుదలయ్యే సినిమాలు ఆర్.ఎస్.ఎస్. వాళ్ళు ఏం చెప్తే అది తీస్తూ, చరిత్రను పక్క దారి పట్టిస్తున్నారని తెలిపారు.

 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ   జిల్లా కార్యదర్శి  ఆర్.జనార్ధన్ మాట్లాడుతూ కళాకారులంటే కేవలం జనాల్ని వినోదపరిచే వాళ్ళే కాదని దోపిడీ,పీడనకి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ప్రజలను పాల్గొనేలా అరుణోదయ సాంస్కృతికంగా చైతన్యం చేసిందని అన్నారు. అరుణోదయ ఒక లక్ష్యం కోసం పనిచేస్తుందని దేశంలో జనాభాలో ఉన్న మెజారిటీ ప్రజల అశాంతికి,అసమానతలకు కారణమవుతున్న ప్రస్తుత దోపిడీ వ్యవస్థను కూల్చాలంటుందని,దాని స్థానంలో నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించే దిశగా పనిచేస్తుందని అన్నారు.

అరుణోదయ కళాకారులుగా అమెరికా, ఇజ్రాయిల్ ల మూలంగా ప్రపంచ శాంతికి భంగం కలిగించే దుచ్చర్యలపై  ప్రజల్ని చైతన్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్ రాష్ట్ర అద్యక్షులు మామిడాల భిక్షపతి,జిల్లా అరుణోదయ నాయకుడు ఇక్కిరి సహదేవ్,అరుణోదయ జిల్లా అధ్యక్షులు శికిలం కుమారస్వామి, పి.డి.ఎస్.యూ జిల్లా మాజీ నాయకులు,రిటైర్డు టీచర్ పూల నాగయ్య, కల్లెపు అడివయ్య,  నాయకులు మారుజోడు సిద్దేశ్వర్, ఎలగందుల సిద్ధులు, ఆర్.ఉదయ్,బేజాడి కుమార్,పి.సుదర్శన్, మోతిలాల్, దార భాస్కర్, మేకల వెంకటేష్, కుమార్, మామిడాల భాను, వడ్డేపల్లి బాలరాజు, నల్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -