ప్రధాన కార్యదర్శిగా రూపమ్ రారు
విజయవంతంగా ముగిసిన జనరల్ కౌన్సిల్
నవ తెలంగాణ – హైదరాబాద్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని అధికారుల ప్రాతినిద్య సంస్థ అయినా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఎఐఎస్‌బీఓఎఫ్) హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ సంస్థ 29వ వార్షిక జనరల్ కౌన్సిల్ సమావేశం విజయవంతంగా ముగిసినట్లు తెలిపింది. జూన్ 27 నుండి 29 వరకు జరిగిన ఈ సమావేశంలో ఎఐఎస్‌బీఓఎఫ్ అధ్యక్షుడిగా అరుణ్ కుమార్ బిషోరు, ప్రధాన కార్యదర్శిగా రూపమ్ రాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025-2028 కాలానికి గాను వారు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, పరిశీలకులు హాజరయ్యారు. 17 సర్కిళ్ల నుంచి వచ్చిన 700 మంది ప్రతిని ధులు సహా పరిశీలకులతో దాదాపు 2000 మంది అధి కారులు పాల్గొన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సందర్బం గా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వినరు ఎం టోన్సే, కిషోర్ కుమార్, సహదేవన్ రాధాకృష్ణన్‌ను సత్కరించారు. ఇతర ట్రేడ్ యూనియన్లకు సంబంధించి ఎఐబీఈఏ జనరల్ సెక్రెటరీ సిహెచ్ వెంకటాచలం, ఎన్‌సీబీఈ జనరల్ సెక్రెటరీ ఎల్ చంద్రశేఖర్, ఎఐబీఓసీ అధ్యక్షుడు ఆర్ శేఖరన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎఐఎస్‌బీఓఎఫ్ అధ్యక్షుడిగా అరుణ్ కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES