- Advertisement -
నూతన అధ్యక్షునికి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల బిజెపి అధ్యక్షునిగా పి అరుణ్ పటేల్ ను నియమించారు. నూతన అధ్యక్షునిగా నియమితులైన పి అరుణ్ పటేల్ కు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణాతార శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ నియమ నిబంధనల ప్రకారం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో డోంగ్లి సింగల్ విండో చైర్మన్ ఎన్డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ సిర్పూర్ గజానంద్ పటేల్ పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -