– దిల్ సుఖ్ నగర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి కరపత్రం ఆవిష్కరణ.
నవతెలంగాణ-దిల్ సుఖ్ నగర్ : హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రోజంతా జరుపుకుందామని. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. 2024 డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్ లోనే తన 50 వసంతాల సభలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తన 50 ఏళ్ళ చరిత్రను, కృషిని, పరిస్థితిని సృజించుకునే పనితో పాటు ‘అరుణోదయం’ అనే సావనీర్ను ఆవిష్కరించుకోవడం. అలాగే అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటూమనీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య హైదరాబాద్ అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. ఒక విప్లవ సాంస్కృతిక సంఘంగా ఉన్నా అరునోదయ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటూ పనిచేస్తుంది అని హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సురేష్ అన్నారు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆదివాసుల పైన జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని అలాగే ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలకు ముందుకు రావాలని తెలిపారు. అరుణోదయ ముగింపు సభలను జయప్రదం చేయాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో హాస్టల్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ బాను ప్రసాద్ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
బాయ్స్ హాస్టల్ లో అరుణోదయ కరపత్రం ఆవిష్కరణ.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES