Friday, November 21, 2025
E-PAPER
Homeసినిమాచైతూ బర్త్‌డే కానుకగా..

చైతూ బర్త్‌డే కానుకగా..

- Advertisement -

హీరో నాగ చైతన్య ఓ మిథికల్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను థ్రిల్‌ చేయబోతున్నారు. కార్తీక్‌ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా, ‘లాపతా లేడీస్‌’ ఫేమ్‌ స్పార్ష్‌ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్‌ తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో సినిమా కోసం జరుగుతున్న కృషి, క్రియేటివ్‌ వర్క్‌ ప్రతిబింబించింది.

ఈనెల 23న హీరో నాగ చైతన్య బర్త్‌ డే సందర్భంగా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. నాగ చైతన్య కెరీర్‌లో హై బడ్జెట్‌ సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుంది. మిథ్‌కు రూటెడ్‌ థ్రిల్లర్‌గా, యూనిక్‌ నెరేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌, హై-ఇంటెన్సిటీ స్టోరీటెల్లింగ్‌తో మునుపెన్నడూ లేని అనుభూతిని ఈసినిమా అందించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి సమర్పణ: బాపినీడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నరసింహా చారి చెన్నోజు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -