అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మొదటి రెండు పాటలకు, ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లింప్స్‌లకు వచ్చిన అద్భుతమైన స్పందనతో దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు విడుదలైన ప్రత్యేక గ్లింప్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఒక శక్తివంతమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్, ఆధ్యాత్మికతతో కూడిన అవతార్‌లో కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్‌లో చరణ్ ఒక పల్లెటూరి అఖాడా మధ్యలో నిలబడి వుండగా, ఆయన ప్రెజెన్స్ అందరినీ కట్టిపడేసింది. పెహల్వాన్‌లా తీర్చిదిద్దుకున్న శరీరం, రగ్గడ్ గడ్డం, వెనక్కి కట్టిన జుట్టు, అన్నీ కలిసి గ్రామీణ అసలైన వాతావరణాన్ని బలంగా ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ఇతర ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, సంగీతం: ఏఆర్ రెహమాన్, డీఓపీ: ఆర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్.
శక్తివంతమైన పెహల్వాన్‌గా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



