లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్’. లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను నటుడు జగపతిబాబు రిలీజ్ చేశారు.
ప్రొడ్యూసర్ తరుణిక మాట్లాడుతూ,’మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మనసుకు హత్తుకునే సెంటిమెంట్‌తో ఈ సినిమా ఉంటుంది. ”రాజు గాని సవాల్” సినిమా సక్సెస్ పై నమ్మకం ఉంది’ అని అన్నారు.
‘హైదరాబాద్ కల్చర్‌ను చూపిస్తూ, తెలం గాణలో ఫ్యామిలీ బాండింగ్‌ను రిఫ్లెక్ట్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. తెలంగాణ సంస్కతి నేపథ్యంగా సాగే క్లాసిక్ మూవీ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది. బాపిరాజు మా సినిమాను చూసి, రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని హీరో లెలిజాల రవీందర్ చెప్పారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ‘బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్‌తో తెలంగాణ నేపథ్యంతో వస్తున్న చిత్రమిది. ఇప్పటిదాకా సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది’ అని తెలిపారు.
రక్షాబంధన్ కానుకగా..
- Advertisement -
- Advertisement -