Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేమికుల రోజు కానుకగా..

ప్రేమికుల రోజు కానుకగా..

- Advertisement -

శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై నటుడు అర్జున్‌ దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్‌, సత్యరాజ్‌, ప్రకాష్‌ రాజ్‌, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. అర్జున్‌ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ఆయన మేనల్లుడు యాక్షన్‌ ప్రిన్స్‌ ధ్రువ సర్జా మరో స్పెషల్‌ కామియో రోల్‌ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో ‘పయనమే’ పాటను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాయగా, అనూప్‌ రూబెన్స్‌ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది.

ఈ మెలోడియస్‌, రొమాంటిక్‌ పాటను అనూప్‌ రూబెన్స్‌, సత్య ప్రకాష్‌ కలిసి ఆలపించారు. ఇక ఈ పాటలో అర్జున్‌, అనూప్‌ రూబెన్స్‌ కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీని కూడా ఈ లిరికల్‌ వీడియోలో చక్కగా చూపించారు. ప్రస్తుతం షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తుండటంతో ప్రమోషనల్‌ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి స్టోరీ-స్క్రీన్‌ ప్లే-ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌: అర్జున్‌, డైలాగ్స్‌: సాయి మాధవ్‌ బుర్ర, మ్యూజిక్‌: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్‌, ఎడిటర్‌: అయూబ్‌ ఖాన్‌, ఆర్ట్‌ డైరెక్టర్స్‌: మోహన్‌ బి కేరీ, శివ కామేష్‌ డి, ఫైట్స్‌ : కిక్‌ యాస్‌ కాళీ.త1

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -