Thursday, February 5, 2026
E-PAPER
Homeసినిమాబుల్లెట్‌ సునీల్‌గా..

బుల్లెట్‌ సునీల్‌గా..

- Advertisement -

హీరో శర్వానంద్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌-ఫ్యామిలీ డ్రామా ‘బైకర్‌’. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.
రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్‌ పాత్రను బుల్లెట్‌ సునీల్‌గా పరిచయం చేస్తూ రీ-స్టార్ట్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
మాజీ మోటోక్రాస్‌ రేసర్‌ సునీల్‌.. ‘బుల్లెట్‌ సునీల్‌’గా పాపులర్‌. 18 ఇండియన్‌ ఛాంపియన్‌షిప్స్‌, 57 సౌత్‌ జోన్‌ టైటిల్స్‌, 100కు పైగా రేస్‌ విజయాలతో అద్భుతమైన ట్రాక్‌ రికార్డ్‌ తనది. అయినా అతడి ప్రయాణం అక్కడితో ఆగి పోలేదు. ‘ఇండియన్‌ రేసర్లు ఓడిపోయేవాళ్లే’ అన్న భావన అతడిని కలచివేస్తుంది. ఆ అభిప్రాయాన్ని చెరిపేసి, రేసింగ్‌ సర్క్యూట్‌లో భారతదేశానికి ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించుకుంటాడు. గత విజయాలు గురించి ఆలోచించకుండా, సునీల్‌ తన అనుభవాన్ని మళ్ళీ పోరాటంలోకి మళ్లిస్తాడు. ఆ పాత్రకు రాజశేఖర్‌ ఇచ్చిన ఇంటెన్సిటీ, తపన, ఎమోషనల్‌ డెప్త్‌ ఆ ప్రయాణాన్ని మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి. శర్వా సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 3న రిలీజ్‌ కానుంది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -