హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు. శనివారం మేకర్స్ ఈ సినిమాలో రేబా మోనికా జాన్ పోషిస్తోన్న ఐపీఎస్ సీతా పరశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేలా కనిపిస్తోంది. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న రేబా జాన్ ఈ చిత్రంలో మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ఆమె తనదైన నటనతో ఎలాంటి థ్రిల్స్ ఇవ్వనుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. డిఫరెంట్ ప్రమోషన్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అని మేకర్స్ తెలిపారు.
ఐపీఎస్ సీతా పరశురామ్‌గా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



