బీజేపీ కుట్రలను తిప్పికోడదాం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఓటు చోరీ ఉన్నంతవరకూ నిరుద్యోగం, అవినీతి పెరుగుతూనే ఉంటుందని లోక్‌సక్ష ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. యువత ఇకపై ఇలాంటి కుట్రల్ని సహించరని చెప్పారు.ఒక ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని అధికారంలోకి వచ్చినప్పుడు, దాని ప్రథమ కర్తవ్యం యువతకు ఉపాధి, అవకాశాలను కల్పించడం అని ఆయన అన్నారు. ”కానీ బీజేపీ నిజాయితీగా ఎన్నికల్లో గెలవదు. ఓట్లను దొంగిలించడమే కాదు. దర్యాప్తు సంస్థలను నియంత్రించడం ద్వారా అధికారంలో ఉంటారు” అని గాంధీ ఆరోపించారు.
45 ఏండ్ల గరిష్టస్థాయికి నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టస్థాయికి చేరుకున్నదని రాహుల్ వివరించారు.ఉద్యోగాలు భర్తీ చేయటంలేదు.నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అందుకే ప్రతి పరీక్షా పత్రాల లీకులే కాదు ప్రతి నియామకం అవినీతి కథలతో ముడిపడి ఉన్నాయి” అని గాంధీ ఆరోపించారు.
ఓటు చోరీ ఉన్నంత వరకు నిరుద్యోగం, అవినీతి
- Advertisement -
- Advertisement -