మోహన్.జి దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది 2’. 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశపు నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. రిచర్డ్ రిషి లుక్, చక్కటి పాటలు, విజువల్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచాయి.
ఇందులో చిరాగ్ జానీ పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా నటిస్తుండటం అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ, ‘మహమ్మద్‌బీన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ నటించారు. విలన్‌గానే కాకుండా.. తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యల్లో పడే పాలకుడిగా చూపించే క్రమంలో దాన్ని చిరాగ్ అద్భుతంగా పోషించారు. చరిత్రలో తుగ్లక్‌ను తెలివైన మూర్ఖుడు అని అంటుంటారు. ఇలాంటి పాత్రను చేయాలంటే లుక్ పరంగా గంభీరంగా కనిపిస్తూనే మేథస్సు, తెలివిని బ్యాలెన్స్ చేస్తూ నటించే యాక్టర్ కావాలి.
ఇలాంటి వేరియేషన్‌ను చూపించటం చాలా కష్టంతో కూడుకున్నది. చిరాగ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై, పాత్రలో అన్నీ రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించారు’ అని అన్నారు. ఇందులో రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటించారు. నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా వై.జి. మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమాను చోళ చక్రవర్తి (నేతాజీ ప్రొడక్షన్స్), జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నిర్మించారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు. సంతోష్ నత్యాలను, తనిక టోనీ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. ఎడిటర్‌గా దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా కమల్‌నాథన్ బాధ్యతలను నిర్వహించారు. పద్మ చంద్రశేఖర్, మోహన్.జి డైలాగ్స్ రాశారు.
మహమ్మద్‌బీన్ తుగ్లక్‌గా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



