అభిషేక్ నామా నిర్మిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. తాజాగా చిత్ర బృందం హీరోయిన్ నభా నటేష్‌ను పార్వతి పాత్రలో పరిచయం చేస్తూ, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో నభా నటేష్ అద్భుతమైన, సాంప్రదాయ లుక్‌లో కనిపించింది. హుందాతనం, పవిత్రత, ఆధ్యాత్మికత వెదజల్లుతోంది. ఆమె ముఖంలో కనిపించే ఆత్మీయమైన భావం, భక్తి, పురాణాల మూలాల నుంచి పుట్టిన పాత్రను సూచిస్తుంది. పోస్టర్‌కు మరింత వైభవాన్ని జోడిస్తూ ఆమె చేయి సమీపంలో నీలి రంగు పక్షి దర్శనమిస్తుంది. పక్కనే రాజసంగా నిలిచిన నెమలి, వెనుక కనిపించే ఆలయ నేపథ్యం అన్నీ ఈ పాత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి.
ఐశ్వర్య మీనన్ మరో కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతదేశంలోని పురాతన విష్ణు దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ కథాంశం నాగబంధం సంప్రదాయంలోని పవిత్ర రహస్యాలను అన్వేషిస్తుంది. ఈ వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానుంది.ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా, నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే, జునైద్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్, ఎడిటర్: పవన్.
‘నాగబంధం’లో పార్వతిగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



