Sunday, June 15, 2025
E-PAPER
Homeసోపతిఒంటల్లా సదువు - పంటల్లా పరువు

ఒంటల్లా సదువు – పంటల్లా పరువు

- Advertisement -

అందరోచిండ్రు గద పిల్లలు తాతను గిట్ల తోల్కొస్తున్నారా… వానలు పడ్తున్నారు గదా జారి పడేరు ఒచిండ్రా తాత! నమస్థే!
మంచిగల్వాటైతది ధ్యానం గురించి మొన్నటి సందీ తెలుస్తుందిలే ఆరంగా కూసో ఇక స్టార్ట్‌ చేద్దామా?
ఓన్‌ టు త్రీ… ఇక మెల్లగా కనులు తెరుఉండ్రీ.. సమంత అనూష ఇన్ని రోజులు గ్రంథాలయంలో ఇవన్నీ నేర్చుకున్నరు కదా, ఇంకా ఇప్పటినుంచి ఇప్పటికి సాల్వ్‌ చేయండి, ఇవన్నీ దసరా సెలవుల్లో చేద్దాం గాని ధ్యానం మాత్రం రోజు చేయాలి. ఇస్కూలు తెరిచినాక రోజు గణపతిని పూజించి అమ్మ నాన్నలకు పూజించి స్కూళ్లకు పోవాలి.. మీ కన్నా పెద్ద వాళ్ల దగ్గర పుస్తకాలు తీసుకొని ఈ రెండు మూడు రోజులు మొదటి పాఠం అన్ని సబ్జెక్టులలో చదవండి. పోయిన సార్‌కి ఈ సార్‌కి అదే సిలబస్‌.
ఏరా రిత్కేష్‌ మీ అమ్మని ఏమో అడిగినవంట ఏంది. పిండివంటలా మురుకులు చేయాల్నా. సరే చేయమను గాని పిండి వంటలల్లో మీరు పిల్లలే పిండిని ఒత్తాలి. ఆ మురుకులు కాస్త ఎలా ఉండాలంటే అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒకటి రెండ్లు.. ప్లేసులు, మైనస్లు, డివిజన్లో సబ్ట్రాక్షన్లు అన్నిటి గుర్తులు ఉండాలి. ఇలా చేస్తే సదువు అయితది, వంటలు అయితై. మీకు గుర్తునట్టు కూడా ఉంటది. ఎట్లున్నా తినేది మనమేగా అదే మనసేదా ఈ సమ.
ఇవన్నీ చేసినాక ఒకసారి నా దగ్గరకు తీసుకురండి. నేను చూస్తా. ఏంరో ఏమంటున్నావ్‌? నేనేం తిననురా. నేను ఎట్లా చెప్తే గట్ల. ఇంతే చాలు అదే నాకు మస్తు…
ఏం పిల్లలు 11 తారీఖున వేరొక పున్నం చేసుకున్నారా. ఎట్లా అనిపించింది. ఏంరా విత్కేష్‌ ఎడ్లను అడిగినవా? అదేరా స్థానం చేపిచ్చినవా. రంగులు పెట్టినవా. ఎడ్లకేమి వినిపించినవు? అట్లు తినిపించినావా, పోలలు తినిపించినావా? ఎట్లా అనిపించింది… ఎడ్లు ఏమైనా చెప్పినా నీకు వాటి ముఖంలో ఆనందం చూసినవా? నీకేమనిపించిందిరా? మనకేమంటారా మట్టి నమ్ముకున్నటోలం. మట్టే మనకి అన్నీ. భూమికి పూజ చేసినావారా? సరేలే ఒక్కొక్క ఊళ్ళ ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు.
మన ప్రయత్నం మనం చేయాలి, ఫలితం గురించి వదిలేయాలి. ఎట్లా అంటే భగవద్గీతల కష్ణ పరమాత్ముడు వాళ్ళ బామ్మర్దికి ఇదే చెప్పిండు..
ఈ స్కూలు తెలుసు కదా రోజు సాయంత్రం కలుసుకుందాం. పగలు ఇస్కూల్‌కి పోతారు కదా అందుకే రాత్రి ట్యూషన్‌ లెక్క కలుద్దాం సరే ఇక పొండి.
– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -