సుధీర్ బాబు, బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ కావడం ఆనందంగా ఉందని మేకర్స్ తెలిపారు. అలాగే తాజాగా శనివారం మేకర్స్ సితారగా దివ్య ఖోస్లాను పరిచయం చేశారు. బ్యూటీఫుల్, క్లాసిక్‌గా కనిపించిన దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్ అందరినీ అలరిస్తోంది.
విజనరీ టీమ్, జోనర్ బౌండరీలు చెరిపేసే కాన్సెప్ట్‌తో ‘జటాధర’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్‌లలో ఒకటిగా వస్తోంది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా భారతీయ సినిమాల్లో నెక్స్ట్ మైథాలజికల్ ఎపిక్‌గా మారబోతోందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు.
జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
‘ఇదొక భిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం. ఇందులో సుధీర్‌బాబు, సోనాక్షిసిన్హా పాత్రలు అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాయి. ముఖ్యంగా సుధీర్‌బాబు ఇందులో కనిపించే తీరు, ఆయన పాత్ర తీరుతెన్నులు గూస్‌బంప్స్ తెప్పి స్తాయి. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా నిలిచే ఈ చిత్రంలో సుధీర్‌బాబుకి పోటాపోటీగా సోనాక్షి నటించారు. ఆద్యంతం ఈ సినిమా ప్రేక్షకుల్ని సీట్‌ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘జటాధర’లో సితారగా..
- Advertisement -
- Advertisement -