న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మ రాజుపల్లి టీవీ’. సాయి తేజ్, వేద జలంధర్ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్ చేశారు.
వంశీకాంత్ రేఖన కంపోజ్ చేసిన ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించారు. మమత రమేష్ పాడారు. ‘కొమ్మ కొమ్మల్లో కోయిల కూయంగ, తెల్ల వారే మా పల్లె పచ్చపచ్చంగ, ఎచ్చని ఎలుగు సీరే కట్టె సక్కంగ.. శివరాతిరి పండక్కి ఊరు, చిన్నా పెద్దల్లోన మొదలయ్యెను జాతర జోరు..’అంటూ ఆహ్లాదకరమైన పల్లెటూరిలో జరిగే శివరాత్రి జాతర సందడిని, ఆ పండక్కి ఊరు ప్రజలంతా సన్నద్ధమయ్యే తీరును వర్ణిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట అని మేకర్స్ తెలిపారు.
‘కొమ్మ కొమ్మల్లో కోయిల కూయంగ..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



