నవతెలంగాణ – నవాబుపేట
మండల పరిధిలోని తీగలపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పలకలు, పేన్సిల్ లను నెత్తికొప్పుల ఆశన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నా కూతురు సంధ్య పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ఈ పంపిణీ చేసినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు తన వంతు సహకారం అందించి, విద్యార్థుల చదువు కోసం మరింత ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది అని అన్నారు. విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అని కొనియాడారు. పాఠశాల ఆవరణలో మొరం మట్టిని సేకరించి, తన స్వంత డబ్బులతో గుంతలను పూడ్చి వేశారు. దీంతో విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు. ఈ విధంగా తన సహాకారం అందించడంతో గ్రామ పెద్దలు ఆశన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ గోపాల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన ఆశన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES