Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12న దేశవ్యాప్త సమ్మెలో ఆశాలు, అంగన్వాడీలు

12న దేశవ్యాప్త సమ్మెలో ఆశాలు, అంగన్వాడీలు

- Advertisement -

ఐసీడీఎస్‌ డైరెక్టర్‌, ఆరోగ్యశాఖ కమిషనర్‌కు సీఐటీయూ సమ్మె నోటీసు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు పాల్గొంటారని సీఐటీయూ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ శృతి ఓజాకు, ఆరోగ్య శాఖ కమిషనర్‌కు వేర్వేరుగా తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆశావర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పి. జయలక్ష్మి సమ్మె నోటీసులను అందజేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలను, ఆశావర్కర్లను రెగ్యులర్‌ వర్కర్లుగా గుర్తించి పే కమిషన్‌ను నియమించాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు, కనీస పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్లకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కల్పిం చాలని విన్నవించారు. ఆశావర్కర్లకు దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పనిపరిస్థితులను కల్పించాలనీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 20 రోజుల క్యాజువల్‌ సెలవులు, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌లు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సీని యార్టీ ప్రకారం ఏఎన్‌ఎమ్‌ పోస్టుల్లోకి పదోన్నతి కల్పించాలని కోరారు. అంగన్‌వాడీలకు కార్మిక సంఘం హక్కులను కల్పించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ టీచర్లను మూడో తరగతి ఉద్యోగులు గా, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఐసీడీఎస్‌ను ప్రయివేటుకు అప్పగించొద్దనీ, ఈకేవైసీ పేరుతో లబ్దిదారులను తొలగించవద్దని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోని నిర్వహించాలని కోరారు. ఐసీడీఎస్‌కు సంబంధం లేని పనులను అంగన్‌వాడీలకు అప్పగించొద్దని విన్నవించారు. ఎన్‌ఈపీ-2020, వీబీజీ ఆర్‌ఏఎమ్‌ జీ -2025, శాంతి చట్టం-2025, విద్యుత్‌ సవరణ బిల్లు, సబ్‌కీ పరీక్ష సబ్కా బీమా బిల్లు, వికసిత భాతర్‌ శిక్షా అభిస్టాన్‌ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -