Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశా భోస్లే మరణం సంగీతలోకానికి తీరని లోటు

ఆశా భోస్లే మరణం సంగీతలోకానికి తీరని లోటు

- Advertisement -

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

భారతదేశం గర్వించదగ్గ గాయని, పద్మవిభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశాభోస్లే అస్తమయం పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె మరణం సంగీతలోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తన పదేండ్ల వయసులోనే కెరీర్‌ ప్రారంభించి దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు, వివిధ భాషల్లో అద్భుతమైన పాటలు పాడి భారత సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని గుర్తు చేశారు. వైవిధ్యభరితమైన గాత్రంతో శాస్త్రీయ సంగీతంతోపాటుగా, గజల్స్‌, పాప్‌ మ్యూజిక్‌లోనూ రాణించి కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాలను వారు గెలుచుకున్నారని కొనియాడారు. భారతీయ సంగీత ప్రపంచానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆదరణీయ గాయని ఆశాబోస్లే ఎన్‌ రామచందర్‌రావు
ఆదరణీయ గాయని ఆశాభోస్లే మరణ వార్త విని తీవ్రంగా బీజేపీ అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ యుగానికి మరపురాని గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. లతా మంగేష్కర్‌, ప్రఖ్యాత గాయకులు మహమ్మద్‌ రఫీ, కిషోర్‌ కుమార్‌తో కలిసి ఆమె దాదాపు అరవై ఏండ్లకు పైగా హిందీ సంగీత రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందారని గుర్తు చేశారు. ఆశాభోస్లే మరణం పట్ల ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -