Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆశావర్కర్లకు రూ.18 వేల వేతనమివ్వాలి

ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనమివ్వాలి

- Advertisement -

– పదోన్నతులు, బీమా తదితర సమస్యలు పరిష్కరించాలి
– వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆశావర్కర్లకు రూ.18 వేలు ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలనీ, పదోన్నతులు, బీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌కు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదమ్మ వినతిపత్రం అందజేశారు. 2023 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఆశావర్కర్ల నిరవధిక సమ్మె సందర్భంగా ఉన్నతాధికారులు నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ హామీల విషయమై అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోయారు. గత ధర్నాల సమయంలో రూ.50 లక్షల బీమా, పదోన్నతులు, మట్టి ఖర్చులకు రూ.50 వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సెలవులు, పదోన్నతుల వంటి సౌకర్యాలు కల్పిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ట్రైనింగ్‌ పూర్తి చేసిన ఆశాలకు, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల్లో పదోన్నతలు కల్పించాలనీ, వెయిటేజీ మార్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమ్మె, మ్యానిఫెస్టో, ధర్నాల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. బీమా రూ.50 లక్షలు, మట్టి ఖర్చులకు రూ.50 వేలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 10న ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు, ఏటా 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్‌ సెలవులు, 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్‌ సెలవులు వర్తింపజేయాలని కోరారు. ఏఎన్సీ, పీఎన్సీ తదితర టార్గెట్లను రద్దు చేయాలని విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -