– సిఐటియు చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ 4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూనియన్ రాష్ట్ర నాలుగవ మహాసభలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 26, 27, తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హల్ లో జరిగే మహాసభలలో భాగంగా మొదటి రోజు బహిరంగ సభ, రెండవ రోజు ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆశాలకు 18000 ఫిక్డ్స్ వేతనం చెల్లిస్తామని, పియఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని, ఏఎన్ఎం, జిఎన్ఎమ్ ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ఏఎన్ఎం, జి ఎస్ ఎమ్ పోస్టులలో డైరెక్ట్ ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని లేదా వేయిటేజి మార్కులు నిర్ణయిస్తామని వంటి అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోగ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, అదనంగా చేయించిన పనులకు డబ్బులు ఇవ్వకుండా,అదనపు పని భారలను మోపుతూ ఆశాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మహాసభలకు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సీఐటీయు రాష్ట్ర నాయకత్వం హాజరు కానుందని తెలిపారు. ఈ మహాసభలలో ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకుంటామని తెలిపారు. 26 న జరిగే బహిరంగ సభకు జిల్లాలోని ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజనర్సు, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరా, రాజశ్రీ, మమత, భాగ్యలక్ష్మి, పల్లవి, కవిత, లలిత, గంగమణి, విజయ, అనిత, కృష్ణవేణి, నాగమణి, మంజుల, స్వప్న, శారద, ప్రమీల, మణెమ్మ, సుధారాణి, లావణ్య, శోభ తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



