Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశాలకు కనీస వేతనం రూ.18000 ఇవ్వాలి: సీఐటీయూ

ఆశాలకు కనీస వేతనం రూ.18000 ఇవ్వాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
ఆశావర్కర్లకు కనీస వేతనం నెలకు రూ.18,000గా నిర్ణయించి అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆసంఘంమండలకమిటీఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..ఆశ వర్కర్లకు సరైనపారితోషికం ఇవ్వకుండా అనేక పనులుచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతమూడుసంవత్సరాలుగాలెప్రసీసర్వేలునిర్వహించినప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న లెప్రసీ బిల్లులు వెంటనే చెల్లించాలని, బిల్లులు చెల్లించిన తర్వాతే ఈ సంవత్సరం చేపట్టే సర్వేలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికలు, పల్స్ పోలియో కార్యక్రమాల్లో పనిచేసిన ఆశా వర్కర్లకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించలేదని, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సిఐటియు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ చెరుకు జానకి, ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు చేగోని ధనలక్ష్మి, భూపతి రేణుక, శ్రామిక మహిళ మండల కన్వీనర్ అబ్బగోని సంతోష, పద్మావతి, రేణుక, సైదమ్మ, సుజాత ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -