నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్‌కు తాత్కాలిక బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. భావ స్వేచ్ఛ, ప్రసంగంపై ఎటువంటి ఆంక్షలు లేవని, కానీ కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఎటువంటి పోస్టులు చేయరాదు అని కోర్టు చెప్పింది. జస్టిస్ సూర్య కాంత్, దీపాంకర్ దత్తతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక బెయిల్ షరతును మార్చేందుకు ధర్మాసనం వ్యతిరేకించింది.
గఆపరేషన్ సింధూర్‌పై అనుచిత పోస్టులు చేసిన ఘటనలో.. ప్రొఫెసర్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని హర్యానా పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా కేసు గురించి చెప్పాలని హర్యానా పోలీసులకు కోర్టు సూచించింది. తాత్కాలిక బెయిల్‌ను పొడిగిస్తున్నామని, వచ్చే విచారణ తేదీ నాటికి దర్యాప్తు నివేదికను సిట్ సమర్పించాలని బెంచ్ తన ఆదేశాల్లో పేర్కొన్నది.