తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌..

నవతెలంగాణ-హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త వినిపించింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుద‌ల చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. వానాకాలం పంట పెట్టుబ‌డి కింద రైతుల ఖాతాల్లో నిధులు జ‌మ కానున్నాయి. త్వ‌ర‌లో పోడు భూముల‌కు ప‌ట్టాలు పంపిణీ చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ప‌ట్టాల పంపిణీ అనంత‌రం పోడు రైతుల‌కు కూడా రైతుబంధు సాయం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు కేసీఆర్. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో రైతులు హర్షం వ్య‌క్తం చేశారు.

Spread the love