వందశాతం ఉత్తీర్ణత పొందిన గిరిజన బాలికలు…
అత్యధిక మార్కులు సాధించిన సాయి మణి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఫలితాల్లో పోటీపడుతున్నాయి. పరీక్షకు హాజరైన వారందరూ ఉత్తీర్ణత పొందడమే కాకుండా మండలంలో రెండో స్థానంలో గిరిజన ఆశ్రమ పాఠశాల నిలవడం హర్షనీయం. వసతి గృహం నుండి ఆశ్రమ పాఠశాలగా రూపాంతరం చెందిన అశ్వారావుపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల రెండో బ్యాచ్ పదో తరగతి విద్యార్ధులు అత్యధిక మార్కులు సాధించి మండలంలోనే రెండో స్థానంలో నిలిచారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బావ్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది రెండో బ్యాచ్ పదో తరగతి విద్యార్ధులు 24 మంది పరీక్షలు రాసి మొత్తం విద్యార్ధులు ఉత్తీర్ణత పొందారు. దీంతో 100 శాతం ఉత్తీర్ణత పొందిన ఈ పాఠశాల విద్యార్ధిని, పేరాయిగూడెంకు చెందిన భోగి రాంబాబు వెంకట రమణ దంపతులు కూతూరు భోగి సాయిమణి 600 మార్కులకు 569 మార్కులు సాధించింది. వీరిది అత్యంత పేద కుటుంబం అయినప్పటికీ సాయిమణి చదువులో మాత్రం మంచి ఫలితం సాధించి ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈ పాఠశాల ఉత్తీర్ణత పరంగా మండలంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ 24 మందిలో 10 మందికి 500 పైన మార్కులు వచ్చాయి. మరో 14 మంది విద్యార్ధులు 400 పైన మార్కులు సాధించారు. మంచి ఫలితాలు సాధించిన ఈ బాలికలను ఏటీడీఓ చంద్రమోహన్, ఎంఈవో ప్రసాదరావు, కాంప్లెక్స్ హెచ్ఎం హరిత, ప్రధానోపాధ్యాయులు బావ్ సింగ్, పాఠశాల ఉపాద్యాయులు అభినందించారు.
ప్రయివేటుకు ధీటుగా ఆశ్రమ ఫలితాలు..
- Advertisement -
RELATED ARTICLES