Thursday, October 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ట్రైబల్ స్పోర్ట్స్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

ట్రైబల్ స్పోర్ట్స్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మంచిరాల జిల్లా స్థాయి ట్రైబల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల మైదానం, లక్షేట్టిపేట్ లో గురువారం నిర్వహించగా జన్నారం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, నిర్వహించిన అన్ని ఆటల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారని, ప్రధానోపాధ్యాయులు ఎం శివరాం తెలిపారు. ఈ జిల్లాస్థాయి జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించి,కబడ్డీ సీనియర్స్ విభాగంలో జె. రాహుల్, మహేందర్ కెప్టెన్,వైస్ కెప్టెన్ గా, ఖో ఖో సీనియర్స్లో ఆర్.యువరాజ్,దుర్గా దాస్,ఎన్. విలాస్, ఎస్. గణేష్, జూనియర్ ఖోఖో విభాగంలో ఎస్ ఈశ్వర్, కే. రంజిత్, వాలీబాల్ జూనియర్స్ లో ఏం సంతోష్, అథ్లెటిక్స్ విభాగంలో మూడు కిలోమీటర్లు, 1.5 కిలోమీటర్ రన్నింగ్ లో ఆర్. యువరాజ్, టీ.చందులాల్, 800 మీటర్ల విభాగంలో ఆర్.దుర్గా దాస్, ఆర్ కిరణ్ 200 మీటర్స్ విభాగంలో, ఆర్. సాయికిరణ్ హై జంప్లో, లాంగ్ జంప్ లో ఆర్ కిరణ్, జూనియర్ అథ్లెటిక్స్లో ఏ. సంతోష్ 200 మీటర్స్మరియు 400 మీటర్స్ విభాగంలో, డిస్కస్త్రోలో జె. రాహుల్ వీరంతా జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరచి, ఏటూరునాగారంలో నిర్వహించే జోనల్ స్థాయి ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ కు ఎంపికైనారన్నారు. జిల్లాలోని 16 గిరిజన ఆశ్రమ పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీలలో జన్నారం గిరిజన ఆశ్రమ హై స్కూల్ విద్యార్థులు అన్ని ఆటలలో మంచి ప్రతిభ కనబరిచి ఓవారల్ ఛాంపియన్షిప్ సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు ఎం శివరాజం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను వారిని ఆ స్థాయికి తీసుకెళ్లిన పిడి ఆర్ గణేష్ ను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -