కాపర్ వైర్ చోరీ
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట సరస్వతీ లిప్ట్ ఇరిగేషన్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ను గుర్తు తెలియని దొంగలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా అందులో ఉన్న కాపర్ వైర్ ను ఎత్తుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతులు, స్థానికుల కథనం ప్రకారం.. లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ట్రాన్స్ఫార్మర్ కింద పడడాన్ని, రైతులు, గమనించి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ ను పగుల గొట్టి అందులో ఉన్న రూ.16 లక్షల విలువ గల కాపర్ ను దొంగిలించారని గుర్తించారు. ఈఘటన మూడు, నాలుగు రోజుల క్రితమే దొంగలు కాపర్ ను దొంగిలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు . ఈ ఘటన పై పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు మంగళవారం పలువురు రైతులు తెలిపారు.
ఆష్ట లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES