- Advertisement -
నవతెలంగాణ – ముధోల్: మండలంలోని ఆష్ట గ్రామంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రంకు కేంద్రప్రభుత్వం అనుమతి బీజేపీ నాయకులు పట్టే పురం సతీష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రం మంజూరులో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి అభినందనీయమని సతీష్ రెడ్డి అన్నారు. సోయాబీన్ రైతులకు మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రం అనుమతి కృషిచేసిన ఎమ్మెల్యేకు రైతులు, నాయకులు ,కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



