Friday, May 9, 2025
Homeఖమ్మంఅశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు 34 ఏండ్లు..

అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు 34 ఏండ్లు..

- Advertisement -

విదేశాల్లో స్థిరపడ్డ ఇక్కడి విద్యార్ధులు…
దేశీయంగా రాణిస్తున్న పలువురు…
సాగుతో చదువు ఇక్కడ ప్రత్యేకత…
నేడే వార్షికోత్సవం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు తాలూకా కేంద్రంగా ఉన్నా అశ్వారావుపేట లో 1989 లో 30 మంది విద్యార్ధులతో పాడి పాక లో (నాటు కున్న విత్తనం) ప్రారంభం అయిన స్థానిక వ్యవసాయ కళాశాల ప్రవర్ధమానం చెందుతూ నేడు ఫలాలను అందించే కల్పతరువు గా రూపాంతరం చెందింది. నాడు ఆచార్య ఎన్.జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో భాగం అయిన ఈ కళాశాల 2014 లో ప్రత్యేక తెలంగాణ అవతరణ లో భాగంగా నేడు ప్రొఫెసర్స్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం లో అంతర్భాగంగా వెలుగొందుతుంది. ఈ కళాశాల 34 వ వార్షికోత్సవాన్ని 2025 ఏప్రియల్ 09 శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత  కుమార్ నవతెలంగాణ కు గురువారం తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల  మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకొంది. (1989) లో 30 మంది విద్యార్థులతో ప్రారంభం అయి నేడు 420 మంది విద్యార్థులతో కళాశాల వైభవంగా విరాజిల్లుతుంది. దాదాపుగా 30 బ్యాచ్ లలో విద్యార్థులు విజయవంతంగా తమ బి.యస్.సి.(హాన్స్) వ్యవసాయ విద్యను అభ్యసించి పట్టభద్రులు అయ్యారు. కళాశాల పూర్వ విద్యార్థులు వ్యవసాయ మరియు వ్యవసాయేతర రంగాల్లో వివిధ ఉన్నతస్థానల్లో ఉన్నారు.కొందరు దేశీయంగా మరికొందరు ఇతర దేశాలలో వ్యాపార వేత్తలు గా స్థిరపడ్డారు. 
తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్క్యూ ఎమర్జెన్సీ డీఐజీ నాగిరెడ్డి,కెనడా లో ప్రొఫెసర్ గా రాణిస్తున్న వి.వెంకట రమణ,ఇక్రిశాట్ లో ఉన్నత స్థానంలో ఉన్న హరీష్ కుమార్,బెంగులూరు లో పారిశ్రామిక వేత్తగా స్థిరపడ్డ ఆర్.విహరీష్,ఫుడ్ అండ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజే‌షన్ లో విధులు నిర్వహిస్తున్న ఏ.అశోక్ కుమార్,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్స్ స్ట్రెస్ మేనేజ్ మెంట్,రాయ్ పూర్ లో శాస్త్రవేత్తగా విధుల్లో ఉంటూ గతేడాది వరదల్లో మృతి చెందిన ఎన్.అశ్విని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధులు కావడం తెలంగాణ కు గర్వకారణం. కళాశాలలో విద్యతో పాటు వివిధ క్లబ్స్ తో విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యతా యుతంగా వ్యవహరించే లా ఇక్కడ బోధనా సిబ్బంది తీర్చిదిద్దుతున్నారు.ప్రస్తుతం కళాశాలలో అగ్రి వికాస్ క్లబ్, గ్రీన్ క్లబ్,హెల్పింగ్ హ్యాండ్,టాక్ క్లబ్,బాషా ప్రయోగం శాల, స్పోర్ట్స్ క్లబ్,కల్చరల్ క్లబ్ ఆద్వర్యంలో విద్యార్థిని విద్యార్ధులకు వ్యవసాయ విద్యతో పాటు వారిలోని సృజనాత్మకతను,నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు, పలు భాషలు నేర్చుకునే అవకాశం, సమాజంలోని సమస్యలను నాటక రూపంలో ప్రదర్శించడం,కళాశాల పర్యావరణం కాపాడడం, రైతుల కోసం ఐఎఫ్ఎస్ యూనిట్ ఒక ప్రదర్శన లాగా కళాశాల క్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నారు.దీనితో పాటు కళాశాలలోని వ్యవసాయ క్షేత్రంలో వైవిధ్యమైన వ్యవసాయం, ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా 25 విభిన్న మామిడి రకాలు, కొబ్బరి లో అంతర పంటలుగా కోకో, వక్క,జాజి కాయ లాంటి మొక్కలు పెంచుతున్నారు. అధిక సాంద్రత పద్దతిలో మామిడి సాగు అందులో అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్ కూడా సాగు చేస్తున్నారు. 
కళాశాల నాలుగవ సంవత్సరం విద్యార్థులు అనుభవ పూర్వక వ్యవసాయ సాగు (ఏఈఎల్పీ పీ) విభాగంలో వానపాముల ఎరువు తయారి, పుట్టగొడుగుల పెంపకం,జీవన ఎరువుల తయారి,వివిధ కూరగాయల పంటలు – మునగ, దొండ, గోరుచిక్కుడు,ఆనపకాయ, కాకర, వంకాయ మొదలైనవి సాగు చేస్తున్నారు కళాశాల విద్యార్థులు క్రీడల పోటీ ల్లోనూ అనునిత్యం తమ సత్తా, కళాశాల వైభవాన్ని నలుమూలల వ్యాప్తింపజేస్తున్నారు. 2024 – 25, అంతర కళాశాల క్రీడా పోటీల్లో రాణిస్తున్నారు. ఇంతటి ఘనత ఉన్న కళాశాల 34 వ,వార్షికోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -