Monday, February 16, 2026
E-PAPER
Homeఖమ్మంఆదర్శ మున్సిపాలిటీగా అశ్వారావుపేట

ఆదర్శ మున్సిపాలిటీగా అశ్వారావుపేట

- Advertisement -

– నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం పాలకవర్గం సమిష్టి గా కృషి చేసి అశ్వారావుపేట ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దాలని కౌన్సిలర్ లను కోరారు. ఛైర్పర్సన్,వైస్ చైర్మన్, కౌన్సిలర్ ల ప్రమాణస్వీకారం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మున్సిపాలిటీ అభివృద్ధే తన లక్ష్యమని రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో ఏకమై పని చేయాలని ఆయన సూచించారు.స్వార్థ ప్రయోజనాలు కాకుండా ప్రజాహితం, పారదర్శకంగా నిబద్ధతతో సేవ చేయాలని నూతన ప్రజాప్రతినిధులకు హితవు పలికారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని,పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి,పరిశుభ్రత,తాగునీరు వీధిదీపాలు,డ్రైనేజీ వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్, డిప్యూటీ చైర్మన్ జూపల్లి శశికళ, రమేష్ బాబు, కౌన్సిలర్ లు, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -