- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో గల నిమ్మ వాగు వంతెనపై నుండి ప్రవహించే వరదలో బుధవారం డ్రైవర్ తో సహా గల్లంతైన వాహనం సంఘటనలో అశ్వారావుపేట మండలం లో రెండు గ్రామాల్లో విషాదచాయలు నెలకొన్నాయి. వాహనం మండలం లోని నారం వారిగూడెం వాసి మనుగొండ వెంకట ముత్యం ది కాగా, డ్రైవర్ ఆరేపల్లి మురళి అశ్వారావుపేట మున్సిపాల్టీ మారుతి నగర్ కు చెందినవాడు కావడం గమనార్హం.
- Advertisement -



