Sunday, July 20, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వృద్ధ రైతు మెడపట్టి గెంటేసిన ఏఎస్‌ఐ

వృద్ధ రైతు మెడపట్టి గెంటేసిన ఏఎస్‌ఐ

- Advertisement -

భూమి పట్టా చేయాలని రెవెన్యూ సదస్సులో అధికారులను నిలదీత
పోలీస్‌ అధికారి రాంచందర్‌ సస్పెన్షన్‌ : కలెక్టర్‌
నవతెలంగాణ-ఖానాపూర్‌

భూభారతి రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధుడికి చేదు అనుభవం ఎదురైంది. ఏఎస్‌ఐ అత్యుత్సాహం ప్రదర్శించి వృద్ధుని మెడ పట్టి బయటకు గెంటేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పాత ఎల్లాపూర్‌లో బుధవారం జరిగింది. ప్రభుత్వం రైతుల కోసం భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులు ప్రతిష్టాత్మకంగా చేపట్టినన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం పాత ఎల్లాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. వృద్ధ రైతు అల్లెపు వెంకటి అధికారుల వద్దకొచ్చి.. అధికారులే పొరపాటు చేసి.. తన భూమిని తన పేరున పట్టా చేయడం లేదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భూమి తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని పట్టుబట్టాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్‌ఐ రాంచందర్‌ వృద్ధ రైతును బయటకు రమ్మని అనడంతో.. ‘మధ్యలో నీ రుబాబు ఏందని’ ఆ రైతు ఏఎస్‌ఐని ప్రశ్నించాడు. దీంతో సహనం కోల్పోయిన ఏఎస్‌ఐ వృద్ధ రైతుని మెడ పట్టుకొని బయటకు గెంటేశాడు. ఈ ఘటనతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఏఎస్‌ఐపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధ రైతును సముదాయించాల్సి ంది పోయి అనుచితం గా ప్రవర్తించడం దారుణమన్నారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో ఉన్నతాధికారు లు వెంటనే స్పందించారు. ఏఎస్‌ఐ రాంచందర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు కలెక్టర అభిలాష అభినవ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -