- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై దేవిసింగ్ ఆదివారం వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని ప్రమాదవశాత్తు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు చెందిన దేవిసింగ్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



