నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజిపేట పోలీసు శాఖలో 36 సంవత్సరాల పాటు నిబద్దతతో విధులు నిర్వహించి, అటు ప్రజలు, ఇటు పోలీసు అధికారుల మన్ననలు పొందిన ఏఎస్ఐ శ్రీనివాస్ జిల్లా ఉత్తమ పోలీసు సేవా అవార్డుకు ఎంపికయ్యారు. మొదటి సారిగా 1990 ఆగస్టు లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన శ్రీనివాస్ ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎంపీ మల్లురవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ చేతల మీదుగా ఆయన అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, 30వేల నగదు పారితోషికం అందుకున్నారు. విధి నిర్వాహణలో మంచి పేరు తెచ్చుకున్న ఏఎస్ఐ నాగర్కర్నూల్ జిల్లాలోనే ఉత్తమ్మ పోలీసు సేవా అర్డుదక్కించుకున్న ఏకైక వ్యక్తి తమ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కావడం గర్వంగా ఉందని ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి, స్టేషన్ పోలీస్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్తమ పోలీసు సేవా అవార్డుకు ఎంపికైన ఏఎస్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES