నేడు శ్రీలంక × బంగ్లాదేశ్ మధ్య తొలి సూపర్-4 మ్యాచ్
రాత్రి 8.00గం||లకు
దుబాయ్: ఆసియాకప్ క్రికెట్ టోర్నీ 2025 లీగ్ పోటీలు ముగిసాయి. భారత్-ఒమన్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందే సూపర్-4 బెర్త్‌లు ఖాయం కావడంతో ఈ రెండుజట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ అబుదాబి వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్-4లోకి ప్రవేశించగా.. లీగ్ దశలోనే ఆతిథ్య యుఎఇతోపాటు ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు నిష్క్రమించాయి. ముఖ్యంగా గ్రూప్-బిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సూపర్-4 బెర్త్ కోసం చెమటోడ్చినా ప్రయోజనం లేకపోయింది. ఆ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్ చేతిలో చివరివరకు పోరాడి ఓటమిపాలవ్వడంతో ఆ జట్టు అందరి మన్ననలను అందుకుంది. సూపర్-4కు చేరిన ప్రతిజట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడనుంది. సూపర్-4 మ్యాచ్‌లు ముగిసాక టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య దుబారు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో సూపర్-4 సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం హై టెన్షన్ మ్యాచ్ మరోసారి జరగనుంది.
సూపర్-4 షెడ్యూల్…
20(శని) : శ్రీలంక × బంగ్లాదేశ్ (దుబాయ్)
21(ఆది) : ఇండియా × పాకిస్తాన్ (దుబాయ్)
23(మంగళ) : పాకిస్తాన్ × శ్రీలంక (అబుదాబి)
24(బుధ) : ఇండియా × బంగ్లాదేశ్ (దుబాయ్)
25(గురు) : పాకిస్తాన్ × బంగ్లాదేశ్ (దుబాయ్)
26(శుక్ర) : ఇండియా × శ్రీలంక (దుబాయ్)
28(ఆది) : ఫైనల్(టాప్-2జట్లు) (దుబాయ్)