Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరాశ మిగిల్చిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

నిరాశ మిగిల్చిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

- Advertisement -

– అభివృద్ధి, పెండింగ్‌ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులెన్ని? : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-మందమర్రి

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిరాశ మిగిల్చాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫూలే భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరోవైపు అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి, తమ దగ్గర ఉన్న ఆయుధాల నిల్వలను అమ్ముకోవడా నికి అన్ని దేశాలనూ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి పెత్తనం చేస్తోందని విమర్శించారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలన్నింటినీ ఉల్లంఘించి తప్పుడు పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఆశాలు వేతనాల పెంపు విషయమై చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తే ప్రభుత్వం కక్ష పూరితంగా పోలీసులతో దాడి చేయడం దుర్మార్గమన్నారు. గ్రామపంచా యతీ, మున్సిపల్‌, ఐకేపీ వివోఏలు, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మికుల పోరాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బండారు రవికుమార్‌ మాట్లా డుతూ మంచిర్యాల జిల్లా అభివృద్ధికి, కాళేశ్వరం ముంపు సమస్య పరిష్కా రం, పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఎన్ని నిధులు కేటాయించాయో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోడు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -