- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం అనంతరం, జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, వార్డుల సంఖ్య పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, జీఎస్‌టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ వంటి పలు కీలక బిల్లులకు చట్టబద్ధత కల్పించనున్నారు. వివిధ ఆడిట్ రిపోర్టులు, వార్షిక లెక్కలను కూడా సభలో ప్రవేశపెడతారు. సమావేశాలు మూడు, నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
- Advertisement -



