- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శాసనసభను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ సగటున 32 రోజులు అసెంబ్లీ నడిపిస్తే, కాంగ్రెస్ సగటున 20 రోజులే సమావేశాలు నిర్వహించిందని, ప్రభుత్వం సభ నడిపేందుకు జంకుతోందని, ఇచ్చిన అజెండాను పరిగణనలోకి తీసుకోవడం లేదని, సభను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



