నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంగళవారం షిర్డీని సందర్శించారు. ఈసందర్భంగా సాయినాధుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్‌తోపాటు ఆయన కూతురు, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, సన్నిహిత బంధువులు, మిత్రులతో కలిసి నిన్న రాత్రి దూప హారతి పూజలో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో సాయినాధుని మహా సమాధిని దర్శించుకున్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, అధికారులు సంప్రదాయబద్ధంగా, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ట్రస్ట్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్యను శాలువాతో సన్మానించి, ప్రసాదాలు అందజేశారు.
షిర్డీలో అసెంబ్లీ స్పీకర్ ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



