Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో 'అసైన్డ్‌'కు మళ్లీ సవరణ!

ఏపీలో ‘అసైన్డ్‌’కు మళ్లీ సవరణ!

- Advertisement -

ఆర్డినెన్స్‌ జారీ చేయనున్న ప్రభుత్వం
99 ఏళ్ల లీజుకు అవకాశం
ఉండవల్లి వద్ద రెండో పంపింగ్‌ స్టేషన్‌
ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష : క్యాబినెట్‌ నిర్ణయాలు
అమరావతి :
పేద ప్రజలకు ఎంతోకొంత ఆసరాగా ఉండే అసైన్డ్‌ భూములను మాయమాటలతో వారి వద్ద నుండి గుంజుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్‌భూముల బదిలీలను నిషేధిస్తూ 1977లో రూపొందించిన చట్ట స్ఫూర్తిని నీరుగారుస్తూ ఇప్పటికే కొన్ని సవరణలు జరగ్గా, తాజాగా మరో సవరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అత్యవసరం కావడంతో ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. వాస్తవానికి ఈ మేరకు రూపొందించిన బిల్లు గత అసెంబ్లీ సమాశాల ముందుకు వచ్చింది. అయితే, బిల్లు ఆమోదం పొందకముందే ఉభయసభలు వాయిదా పడటంతో తాజాగా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ సవరణతో అసైన్డ్‌ భూములను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించిన పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి తెలిపారు. ప్రభుత్వం ‘లీజు’ అని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఈ నిర్ణయం ఎవరికి మేలు చేస్తోందో, 99 ఏళ్ల తరువాత భూములపై అధికారం ఎవరి వద్ద ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్లీన్‌ ఎనర్జీపాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని. అమరావతిలో క్వాంటంపాలసీ. నైబర్‌హుడ్‌ వర్క్‌ప్లేస్‌ పాలసీలకు ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు. ఎపి నైబర్‌హుడ్‌ పాలసీతో ప్రతి మండలంలో 20నుంచి 30 వర్క్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుందని అన్నారు. విశాఖలో రియాల్టీ లిమిటెడ్‌ ఐటి పార్కు, రహేజా సంస్ధ పరిశ్రమల ఏర్పాటు, రుషికొండ, కాపులుప్పలపాడులో పరిశ్రమల ఏర్పా టుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

రూ.1863 కోట్లతో అమరావతి లో ఇంటర్నల్‌ రోడ్లు
అమరావతి క్యాపిటల్‌ సిటీ, ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణయ్యపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక, మిగతా 7లో ఉండవల్లి తదితర ప్రాంతాల్లో 1863 కోట్ల రూపాయలతో ఇంటర్నల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రోడ్లు, డ్రైనేజీలు, నీటిసరఫరా, మురుగునీరు, విద్యుత్తు, ఐసిటి కోసం యుటిలిటీ డక్టులు, రీయూజ్‌ వాటర్‌ లైన్‌, ఎస్‌టిపి, అవెన్యూ ప్లాంటేషన్‌ తదిరతాలు ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఉండవల్లిలో ఫ్లడ్‌ పంపింగ్‌ స్టేషన్‌ -2 (సామర్ద్యం 8400 క్యూసెక్కులు) డిజైన్‌, నిర్మాణం, పరీక్ష, కమిషనింగ్‌, 15 సంవత్సరాల నిర్వహణ కోసం ప్యాకేజీ నెంబరు50కి రూ.595.01 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులను కేబినెట్‌ మంజూరు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -