Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెర్కవేడులో బాధిత కుటుంబాలకు చేయూత

పెర్కవేడులో బాధిత కుటుంబాలకు చేయూత

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని పెర్కవేడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ శ్రేణులు ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందగా  శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి చేయూతనందించారు. మృతులు నిమ్మల ఐలయ్య, అద్దపు కృష్ణమూర్తి, అబ్బోజు చంద్రకళా కుటుంబాలను పరామర్శించి యాభై కేజీల బియ్యం, వంట నూనె అందచేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధిలు లేతకుల మధుకర్ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, మండల పార్టీ నాయకులు  శ్రీనివాస్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, ఉబ్బని సింహాద్రి,  గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మేర వీరాస్వామి, మాజీ సర్పంచ్ చిన్నాల రాజబాబు, మాజీ ఎంపీటీసీ బండి రాజబాబు, ఆకుల సమ్మయ్య, నిమ్మల మల్లయ్య, ఎండీ అంజాద్ పాషా, భాషబోయిన పెద్ద సుధాకర్, బండి నర్సయ్య, నిమ్మలా మధు, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -