ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో ఎంపికైన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని కోరుతూ ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో ఏవో జగన్మోహన్ కి వింత పత్రం అందజేశారు. అనంతరం ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక అయిన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు వెంటనే పంపిణి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణి చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక కోసం 2025 జూన్ 6 నాడు టీవీసీసీ/సి1/119/2024 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో పరికరాల కోసం వేలాదిమంది వికలాంగులు దరఖాస్తులు చేసుకున్నారు.7920 మంది లబ్ధిదారులకు 16 రకాల సహాయ పరికరాలు పంపిణి చేయడానికి జిల్లా స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరిగి నెలలు గడుస్తుందనీ, నేటికీ పంపిణికి చేయలేదని, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా పరికరాల పంపిణి కోసం 50 కోట్లు కేటాయించినదని, సహాయ పరికరాల కోసం ఎంపిక అయిన లబ్ధిదారులు పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు.
తక్షణమే సహాయ పరికరాలను పంపిణి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువన జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా కోశాధికారి కొత్త లలిత, బోనగిరి టౌన్ అధ్యక్షులు ఎషాల గోపి లు పాల్గొన్నారు.



