Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలకు భరోసా.. బాధితులకు న్యాయం

మహిళలకు భరోసా.. బాధితులకు న్యాయం

- Advertisement -

ఎన్‌ఆర్‌ఐ కేసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
‘నారీ న్యారు’ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద
హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో భారీగా ఫిర్యాదులు
బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో తెలంగాణ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ”నారీ న్యారు..హియర్‌ హర్‌ ఔట్‌” పేరుతో బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి తరలివచ్చిన మహిళల నుంచి ఆమె నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కొనసాగిన ఈ విచారణలో దాదాపు 100 మందిపైగా మహిళలు తమ సమస్యలను వివరిం చారు. ప్రధానంగా గృహ హింస, ఉద్యోగ ప్రదేశాల్లో వేధింపులు, వివక్ష, ఆర్థిక మోసాలు, సైబర్‌ క్రైమ్‌ తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి.

ఎన్‌ఆర్‌ఐ వేధింపులపై ప్రత్యేక దృష్టి
బాధితుల సమస్యలను విని, తగు పరిష్కారాలు సూచించిన అనంతరం అదనపు కలెక్టర్‌ కదిరవన్‌ పలని, ఉమెన్‌ సేప్టీ డీసీపీలు డాక్టర్‌ లావణ్య, టి.ఉషా రాణి, జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెంకటాచారితో కలిసి చైర్‌పర్సన్‌ మాట్లాడారు. ఫిర్యాదుల్లో అధిక శాతం గృహ హింస కు సంబంధించినవే ఉన్నాయని, అందులోనూ నిందితులు ఎన్‌ఆర్‌ఐలు ఉన్న కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హౌంశాఖ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల ఆవేదనను విని, వారికి త్వరతగతిన న్యాయం చేకూర్చేందుకే వివిధ విభాగాలను భాగస్వామ్యం చేస్తూ.. ఈ బహిరంగ విచారణ ఏర్పాటు చేశామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై తక్షణమే నివేదికలు సమర్పించాలని, బాధితులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారు లను చైర్‌పర్సన్‌ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ కార్యదర్శి పద్మజా రమణ, సభ్యులు షాహిన్‌ అఫ్రోజ్‌, ఈశ్వరి బారు, శుద్ధం లక్ష్మి, గద్దల పద్మ, కొమ్ము ఉమాదేవి యాదవ్‌, ఏ.రేవతిరావు, జిల్లా సంక్షేమ శాఖాధికారులు అక్కేశ్వర్‌ రావు, రాజేందర్‌, రమేష్‌, ప్రవీణ్‌ కుమార్‌, ఆర్‌.కోటాజీ, జి.ఆశన్న, ఇలియాజ్‌ అహ్మద్‌, వివిధ శాఖాధికారులు, వివిధ జోన్‌ల పోలీస్‌ అధికారులు, సఖి నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -