పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.
సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, ‘ఇండిస్టీలో వివాద రహితుడిగా ఎ.ఎం.రత్నంకి పేరుంది. ఈ సినిమా రూపంలో ఆయనకు మరో భారీ విజయం సొంతం అవుతుందని విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్‌ని మీరందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో చేశాను’ అని తెలిపారు. ‘పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి కల ఉంటుంది. అది ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను’ అని దర్శకుడు జ్యోతి కష్ణ చెప్పారు. నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ, ‘సినిమా ద్వారా వినోదంతో పాటు ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. ఈ సినిమా తయారవ్వడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్. నా కుమారుడు అని చెప్పడం కాదు.. జ్యోతికష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు’ అని అన్నారు.
ఘనంగా ‘అసుర హననం..’ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -