Saturday, July 12, 2025
E-PAPER
Homeసినిమా'హనుమాన్‌' స్థాయిలో..

‘హనుమాన్‌’ స్థాయిలో..

- Advertisement -

మైథలాజికల్‌ జోనర్‌లో విరభ్‌ స్టూడియో బ్యానర్‌ పై రేణుకా ప్రసాద్‌, బసవరాజ్‌ హురకడ్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘గదాధారి హనుమాన్‌’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్‌ హీరోగా నటించారు. రోహిత్‌ కొల్లి దర్శకుడు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నిర్మాతలు సి.కళ్యాణ్‌, రాజ్‌ కందుకూరి, డైరెక్టర్‌ సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


హీరో రవి కిరణ్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా నిర్మాతలు బసవరాజ్‌, రేణుకా ప్రసాద్‌కి థ్యాంక్స్‌. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ‘హనుమాన్‌’ సినిమా ఇచ్చిన సపోర్ట్‌, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్‌ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మా చిత్రంలో మ్యూజిక్‌, బీజీఎం, విజువల్స్‌ నెక్ట్స్‌ లెవెల్లో ఉంటాయి. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. నేను నటించిన ‘తారకాసుర’ చిత్రానికి కన్నడ, తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాను కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘మా దర్శకుడు రోహిత్‌ కొల్లి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆ హనుమంతుడి ఆశీస్సులతో ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాం. కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుంది. రవి కిరణ్‌ అద్భుతంగా నటించారు. విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం ఉంటుంది’ అని నిర్మాతలు తెలిపారు.
దర్శకుడు రోహిత్‌ కొల్లి మాట్లాడుతూ,’పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీని తీసుకు వస్తున్నాం. రవి కిరణ్‌ అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఈ మూవీ గ్లింప్స్‌, టీజర్‌ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్‌ ఫుల్‌ అన్న దానిపై ఓ సీక్వెన్స్‌ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -