Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అటల్ బీహారి వాజ్ పేయి సేవలు మరువలేనివి 

అటల్ బీహారి వాజ్ పేయి సేవలు మరువలేనివి 

- Advertisement -

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మర్చిపోలేనివని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ఈతరం నాయకులు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోనీ అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా మండల అధ్యక్షులు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వాజ్పాయ్ అని కొనియాడారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని చెప్పారు.

 భారత దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆయనను గౌరవిస్తాయని, భారతదేశ సాంస్కృతిక మరియు తాత్విక సంప్రదాయాల నుండి తీసుకోబడిన ఇతివృత్తాలతో రాజకీయ వ్యావహారికసత్తావాదాన్ని మిళితం చేయడంలో ఆయన ప్రసంగాలు, కవిత్వం ప్రసిద్ధి చెందాయి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, మండల మాజీ అధ్యక్షుడు నరేందర్, మండల నాయకులు దేవేందర్, బుచ్చయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు శ్రీను నాయక్, మండల ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి,నవీన్, వినోద్,నాగరాజు, చెన్నయ్య, శేఖర్, ఈదమయ్యా, రామకృష్ణ, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -