Magazines

టీపీజీఎల్‌ లో అభిషేక్‌ రెడ్డి హోల్‌ ఇన్‌ వన్‌

35 నిమిషాల క్రితం

TPGL
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ- హైదరాబాద్‌ : ఎన్‌ఎండీసీ టీపీజీఎల్‌ 2026 గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో హోల్‌ ఇన్‌ వన్‌తో గోల్ఫర్‌ అభిషేక్‌ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హైదరాబాద్‌ గోల్ప్‌ కోర్స్‌ వేదికగా బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో‌ మైసా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్‌ రెడ్డి కంకణాల అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 11వ హోల్‌పై ఒకే షాట్‌తో బంతిని హోల్‌లోకి పంపి అభిషేక్‌ రెడ్డి హోల్‌ ఇన్‌ వన్‌ సాధించారు. మైసా జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓటమి పాలైనప్పటికీ అభిషేక్‌ వ్యక్తిగతంగా సాధించిన ఈ ఘనత టోర్నీకి హైలైట్‌గా నిలిచింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో జై రాజ్‌ స్టీలర్స్‌ 4–2తో జీఎంఆర్‌ ఎలిగాన్స్‌పై.. ఎజైల్‌ వ్యాలీ వారియర్స్‌ 3.5–2.5తో హల్దీ ఫెయిర్‌వేస్‌పై గెలుపొందాయి. లండన్‌ రాయల్స్‌ 5–1తో జీఎన్‌ఐటీఎస్‌ లహరి లయన్స్‌ను ఓడించగా, ఐరోకో లార్వెన్‌ అవెంజర్స్‌ 4–2తో మైసా జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్