Magazines

హాకీలో అమ్మాయిలకు మరో గెలుపు

15 నిమిషాల క్రితం

hockey
avatar
balaji

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

కొరియాపై 2-1తో విజయం

భోపాల్‌: మహిళల ఆసియా ఛాంపియన్‌షిప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. బార్కెడా నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1గోల్స్‌ తేడాతో కొరియాపై సంచలన విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో అర్ధభాగం ప్రారంభంలోనే భారత మహిళలు మరో గోల్‌ కొట్టారు. దీంతో 34 నిమిషాల ఆట ముగిసేసరికి భారత్‌ 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. రెండో అర్ధభాగం 56వ నిమిషంలో కొరియా ఒక గోల్‌ కొట్టినా భారత్‌ అప్పటికే ఆధిక్యతలో నిలిచి విజయం సాధించింది. ముంతాజ్‌ ఖాన్‌ రెండో క్వార్టర్‌ చివర్లో 30వ నిమిషంలో ఒక గోల్‌ చేయగా.. మూడో క్వార్టర్‌ ప్రారంభంలోనే టొప్పో సొనోలిటా(33వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. ఇక కొరియా తరఫున ఏకైక గోల్‌ను హాంగ్‌ యంగ్‌జుంగ్‌(56వ నిమిషం)లో చేసింది. 22న భారత మహిళల జట్టు థాయ్‌లాండ్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో భారతజట్టు 4-1తో మలేషియాను ఓడించింది. దీంతో ఆరుజట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్‌షిప్‌ హాకీ టోర్నీలో 2 మ్యాచ్‌లు ముగిసేసరికి భారతజట్టు 6పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. జపాన్‌ కూడా 2మ్యాచుల్లోనూ గెలిచినా.. గోల్స్‌ వ్యత్యాసంతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్